TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీకు మించిన వెన్నుపోటుదారులెవ‌రు?...నారా లోకేష్‌

Published on: Mon Sep 26, 2022 11:43AM

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై హీట్ కొనసాగుతోంది. పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్  ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను షేర్ చూస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌ను ప్రథమ ముద్దా యిని చేసింది స్వయంగా ఆయన కుమారుడేనని తెలిపారు.

హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పోస్ట్‌తో దుమారం మరింత రేగింది. బాలయ్య కాస్త ఘాటుగా స్పందిం చడంతో మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎన్టీఆర్‌ వెన్నుపోటుపై దారిమ‌ళ్లింది. బాల కృష్ణను టార్గెట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోంది. అంతేకాదు చంద్రబాబు గతంలో ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని కొందరు పోస్టర్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. 

ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌పై టార్గెట్ చేయడంతో టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పాత వీడియోలను తెరపైకి తెచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ వెన్నుపోటు విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు

సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రాజశేఖరరెడ్డి ఆయన మంత్రివర్గం కలిసి చేసిన తప్పిది.. నాకేంటి సంబంధం’ అని అప్పట్లో జగన్ అన్నారని ఉండవల్లి ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఉండవల్లి అప్పట్లో మాట్లాడిన వీడియో క్లిప్‌ ను షేర్ చేసి నారా లోకేష్..పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధా రాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్‌ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డేన‌ని నారా లోకేష్ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు.