విజయ్ మాల్యా జైలు.. గాలి, వెలుతురు బాగుండాలి.!!
Published on: Tue Jul 31, 2018 6:21PM
సుమారు 9 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా త్వరలో భారత్ కు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టును కోరింది.. అయితే భారత్ లోని ఆర్థర్ రోడ్ జైలులో తాజా గాలి, సహజమైన వెలుగు లేదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు తెలపడంతో.. మేజిస్ట్రేట్, సెప్టెంబరు 12నాటికి ఆర్థర్ రోడ్ జైలు వీడియోను తమకు సమర్పించాలని తెలిపింది.
.jpg)
భారతదేశ అధికారులు సమర్పించిన ఫొటోలు జైలులోని పరిస్థితులను తెలుసుకునేందుకు సరిపోవని, అందువల్ల వీడియోను సమర్పించాలని తెలిపారు.. కిటికీల గుండా సహజమైన వెలుగు వస్తుందో, లేదో పరిశీలించాలన్నారు.. అదే విధంగా విచారణ సందర్బంగా కోర్ట్ కు హాజరైన మాల్యా, మీడియాతో మాట్లాడుతూ 'తనకు ఉన్న రూ.14 వేల కోట్ల ఆస్తులను అమ్మి బ్యాంకుల రుణాలను చెల్లించేస్తానని అన్నారు.. అయితే తనపై వస్తున్న మనీలాండరింగ్ ఆరోపణలు అవాస్తవమన్నారు.. కలికాలం అంటే ఇదేనేమో వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయింది గాక.. జైలులో గాలి, వెలుతురు సరిగ్గాలేవు అంటున్నాడు.


