రిజ్వాన్‌లో తండ్రి చనిపోయాడు
Published on: Wed Jul 27, 2022 11:33PM
అది మహారాష్ట్ర థానె జిల్లా భీవాండీ పట్టణం. ఐదేళ్ల పిల్లవాడు బికు బికుమంటూ భయాందోళనల మధ్య తండ్రి రిజ్వాన్తో ఉంటున్నాడు. వాడికి అమ్మా..నాన్నా.. అంటూ మాటలు వచ్చేప్పటికే తల్లిదం డ్రులు విడిపోయారు. కారణాలు వాళ్ల బంధు వులు అనేక చెబుతు న్నారు. కానీ రెండు కుటుంబాల పెద్దవాళ్ల వాదోపవాదాలు, తండ్రి మూర్ఖత్వం, తల్లి రోదనల మధ్య పసికందు ఒంటరితనానికి గురవు తున్నాడు. పసివాడేగనుక తల్లిని చూడాలని, ఆమె పాటా, మాటా వినాలని, ఆమె పెట్టే గోరుముద్దలు తినాలనే ఉంటుంది. కానీ అది అసాధ్యం చేసేడు ఆ కసాయి తండ్రి.
ఫాహిమ్ రిజ్వాన్ తన భార్యతో విడిపోయిన తర్వాత కూడా పిల్లాడు కేవలం ఐదేళ్లవాడే గనుక తల్లి వచ్చి కలవడమో, పిల్లాడిని తీసి కెళ్లడామో చేయాలని బంధువులు, హితులు, రిజ్వాన్ స్నేహితులూ ఎంతో చెప్పారు. రిజ్వాన్ అందరికీ, చెప్పినవన్నీ వింటూ తలూపాడు అంతే. తనను కాదనుకున్నప్పుడు పిల్లవాడిని ఎందుకు చూపా లన్న పట్టుదలకు పోయాడు. అంతే పిల్లాడిని ఆమెతో కలవకుండా వీలయినన్ని అడ్డంకులు పెట్టేడు. అయినా ఎవరితో ఒకరితో తల్లిని కలవడం రిజ్వాన్ బొత్తిగా భరించలేకపోయాడు. అతనిలో తండ్రి చనిపోయాడు. రాక్షసుడు లేచాడు. పిల్లవాడిని తన కొడుకు అనే కనీసపు స్పృహా కోల్పో యాడు. అంతే అతను సిగెరెట్ తాగుతూ పిల్లాడికి దానితో వాతలు పెట్టేడు. పిల్లడు బిక్కటిల్లాడు. తల్లి దూరంగా ఉంది. ఆమెకు వాడి రోదన తెలియదు.
ఇలాంటి భయాందోళనల మధ్య ఆ పిల్లవాడు ఇంకెన్నాళ్లు బతుకు సాగించాలో తెలీదు. తండ్రిగా రిజ్వాన్ ఓడిపోయాడు. తల్లికి విడాకులు గోడగా మారింది. పిల్లవాడు బేలగా వీధి వంకే చూస్తున్నాడు. పోలీసులు మాత్రం ఇంకా రిజ్వాన్‌ను అరెస్టు చేయ లేదు. వాళ్లకి ఇంకా ఏవో సాక్ష్యాలు కావాలట.


