TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధం

Published on: Fri Aug 29, 2025 10:06AM

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ  ఆలయంలో శుక్రవారం (ఆగస్టు 29) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల మేరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాల్సి ఉంటుంది. భక్తులు మాత్రమే కాకుండా ఆలయ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆలయ ఉద్యోగులు కొలువులకు సంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది.

అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ ల వినియోగంపై నిషేధం అమలులోనికి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సెల్ ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వినియోగించకూడదు. ఈ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు అమ్మవారి దర్శనానికి రావాలని దుర్గగుడి ఈవో తెలిపారు.