నో బర్త్ డే... స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం
Published on: Tue Sep 3, 2024 4:55PM
పుట్టిన రోజు వేడుకను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రద్దు చేసుకున్నారు. సెప్టెంబర్ నాలుగో తేదీన స్పీకర్ జన్మదినోత్సవం. ఎపిలో భారీ వర్షాలవల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకోవడానికి ఎపి సిఎం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు వేడుక సబబు కాదని అయ్యన్న పాత్రుడు భావించారు. వర్షాలు, వరదల వల్ల 9 మంది మృతి చెందారు. విజయవాడలో 2.76 లక్షల మంది నీళ్లలోనే ఉండిపోయారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయాన్నిపలువురు ప్రశంసిస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతే కాదు తన నియోజకవర్గ ప్రజలు కూడా బర్త్ డే వేడుకలు నిర్వహించకూడదని సూచించారు.


