TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చక్రం తిప్పుతున్న సి.ఎం. సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి

Published on: Wed May 9, 2012 10:11AM

తిరుపతి ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన తిరుపతిలో ఒక క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి నియోజకవర్గంలోని పరిస్టితులను తన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు, తాజామాజీ మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు ఎంపిక అవటంతో ఆయన రాజీనామా చేయటం వల్ల తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్తానలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు మంత్రి గల్లా అరుణకుమారి తన తనయుడు జయదేవ్ పేరును ప్రతిపాదించారు. ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ నడిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ పేరును అధిస్థానం ఖరారు చేసింది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ పనిచేయకుండా అస్మదీయులను బుజ్జగించే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన భుజంపై వేసుకున్నారు.

 

 

అందులో భాగంగానే తన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని ఈ పనిలో పెట్టారు. ముందుగా కిశోర్ కుమార్ రెడ్డి టిక్కెట్టు ఆశిచిన జయదేవ్, మబ్బు చెంగారెడ్డి, ప్రజారాజ్యం పార్టీ విలీనంతో కాంగ్రెస్ లో చేరిన పసుపులేటి హరిప్రసాద్, ఎమ్మార్ పల్లి మాజీ సర్పంచి మమత, టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు పులిగోరు మురళి ప్రభృతులను ఎలా బుజ్జగించాలో సమీక్షించారు. తరువాత కొందరికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణతో ఫోను చేయించారు. తనకు మద్దతు ఇవ్వాలని వెనకతరమణ కోరిన తరువాత కిశోర్ కుమార్ రెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తరుపున కిశోర్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.