TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కామారెడ్డిలో డీలా పడుతున్న టిఆర్ఎస్

Published on: Sat Mar 10, 2012 1:10PM

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో ప్రజలనుంచి ఆదరాభిమానాలు దక్కడం లేదు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామస్తులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఇప్పుడు అటువంటి దృశ్యాలేమీ కనిపించడం లేదు. తెలంగాణా వాదం ఉన్నప్పటికీ ప్రజల్లో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపిస్తోంది. టిఆర్ఎస్ వల్ల తెలంగాణా రావడం కష్టమనే అభిప్రాయాన్ని చాలామంది బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో గ్రామస్తులు టిఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీల వారిని తమ గ్రామంలోకి రావడానికి కూడా అనుమతించలేదు. అయితే ఈసారి కాంగ్రెస్, టిడిపి నాయకులు దర్జాగా గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. వీరికి ఎక్కడా కూడా నిరసనలు ఎదురుకావడం లేదు. ఈ పరిణామాలన్నీ టిఆర్ఎస్ ను కలవరపరుస్తున్నాయి. దీనికి తోడు కాంగ్రెస్, టిడిపిలు పోలింగ్ బూతుస్థాయిలో డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిసింది.ఈ రెండు పార్టీలు తరపున ఉన్న ఏజెంట్లు నేరుగా ఓటర్లకే డబ్బు అందేలా శ్రమిస్తున్నారు. వీరి పకడ్బందీ పంపిణీ కార్యక్రమం వల్ల కూడా టిఆర్ఎస్ కు నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ అభ్యర్ధి గంప గోవర్ధన్ గెలవడం ఖాయమని, అయితే మెజారిటి తగ్గితే కాస్త తగ్గవచ్చని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు.