ఎస్ ఐల బదిలీలపై ఉన్నతాధికారుల విచారణ
Published on: Mon Feb 20, 2012 2:18PM
నిజా
మాబాద్: నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఇటీవల జరిగిన ఎస్పై బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. కోరుకున్న ప్రదేశాలు ఎస్పైలను పంపడానికి కొందరు అధికారులు భారీగా ముడుపులను తీసుకుంటున్నట్లు ఆరోపణలొచ్చాయి. ముడుపుల భాగోతం సంభాషణలను సెల్ ఫోన్ లో కూడా రికార్డుచేసి కొందరు పోలీసు ఉద్యోగులు హైదరాబాదులోని పోలీస్ బాస్ కు పంపడంతో ఆయన ఈ భాగోతంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. బోధన్ డివిజన్ కు చెందిన ఓ ఎస్పైకి కోరుకున్న చోట పోస్టింగ్ కల్పించేందుకు ఉన్నతాధికారికి ముడుపులు అందించాలంటూ ఎఎస్పై అహ్మద్ ఫోన్ లో జరిపిన సంభాషణలను సదరు ఎస్పై రికార్డు చేసి పోలీస్ బాస్ కు పంపడంతో ఈ విషయం బట్టబయలైంది. ఇటీవల కాలంలో సుమారు 50 మంది ఎస్పైలను ఒకచోటి నుంచి మరో చోటికి బదిలీ చేశారు.


