ఆమెను చూస్తే ఈమెకు ముచ్చటేస్తుందట...!
Published on: Mon Nov 18, 2013 10:04AM

ఒకప్పుడు హీరోయిన్ ల నటన అంటే సావిత్రి గారు గుర్తొచ్చేవారు. అంతటి పేరు తెచ్చుకున్నారు సావిత్రి గారు. ఆ తర్వాత జేనేరేషణ్ లో సౌందర్య మరో సావిత్రిగా మారింది. తన నటనలో, అందంలో అన్నింటా మంచి పేరును సంపాదించుకున్నారు ఆవిడ. అయితే ఈ కాలానికి నిత్యామీనన్ మరో సౌందర్య గా నిలుస్తుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని లేడి దర్శకురాలు విజయనిర్మల కూడా అన్నారు.
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం"మాలిని22". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ-విజయనిర్మల,జయసుద ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ..."తెలుగులో లేడి డైరెక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లేడి డైరెక్టర్ల సంఖ్య పెరుగుతోంది. శ్రీ ప్రియ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది. నిత్యామీనన్ యాక్టింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆమె తెలుగు తెరకు పరిచయం కావడం మన అదృష్టం. నిత్య తెలుగు సినిమాకు దొరికిన మరో సౌందర్యగా చెప్పుకోవచ్చు" అని అన్నారు.


