నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ బర్త్ డే విషెస్
Published on: Wed Mar 1, 2017 10:43AM
.jpg)
ఎన్‌డీఏ నుంచి జేడీయూ బయటకు వచ్చినప్పటికీ తన పాత మిత్రుడిని బీజేపీ మరచిపోవడం లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆశిస్తున్నట్టు పీఎం ట్వీట్ చేశారు. అన్నట్టు నితీష్ 66వ ఏట అడుగుపెడుతున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన కార్యక్రమంలో పాత గొడవలను మరచిపోయి మోడీ, నితీష్ ఉల్లాసంగా గడిపారు.
.jpg)


