సీఎం పదవికి నితీశ్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం
Published on: Sat Nov 14, 2015 1:25PM

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందించగా.. గవర్నర్ కూడా తన రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తోంది. అసలు నితీశ్ కుమార్ ఏంటీ రాజీనామా ఏంటీ అనుకుంటున్నారు.. వివరాల ప్రకారం.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం పదవిలో ఉన్న వ్యక్తి కేవలం ఆపద్దర్మ సీఎంగా మాత్రమే పాలన చేపట్టవలసి ఉంటుంది. అనంతరం ఎన్నికల్లో గెలిచిన తరువాత వేరే నాయకుడు సీఎం పగ్గాలు చేపట్టినా లేదా ఒకవేళ అదే నాయకుడు సీఎంగా గెలిచినా అలాగే కొనసాగడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. రాజీనామా చేసి తరిగి మళ్లీ బాధ్యతలు చేపట్టాల్సి వుంటుంది. దీనిలో భాగంగానే నితీశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 20న నితీశ్ తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


