TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా...కొత్త సీఎంగా సామ్రాట్

Published on: Tue Apr 14, 2026 4:27PM

 

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేశారు. ఈరోజు లోక్‌భవన్ చేరుకున్న ఆయన తన రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటు చేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్‌కు తెలియజేశారు. 

నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ముఖ్యమంత్రిగా పలువురు బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో తొలిసారి ఆ పార్టీ ఈ పదవిని చేపట్టినట్లవుతుంది. అయితే ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.