నితిన్ తో పూరిజగన్నాధ్ ‘హార్ట్ ఎటాక్’
Published on: Sat Jul 6, 2013 11:57AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే డైరెక్టర్ పూరి జగన్నాధ్. బిజినెస్ మ్యాన్ తరువాత పూరి కి హిట్ సినిమా రాలేదు. ఇప్పుడు పూరీ దర్శకత్వం వహించే చిత్రానికి హీరోగా నితిన్ నటించనున్నాడు. వరుస విజయాలతో మంచి స్పీడ్ మీద వున్ననితిన్ పూరీ చెప్పిన కథ విని ఓకే చేశాడంట. వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీనే దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ గా ‘హార్ట్ ఎటాక్ ’ ని పెట్టారు. ఈ సినిమాను ఆగష్టులో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు లైన్లో వున్నాయి. కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్వకత్వంలో, అలా మొదలైంది, జబర్దస్త్ చిత్రాల ఫేం నందినీరెడ్డి దర్శకత్వంలో చేయనున్నారు.


