కాక్ పిట్ లో వెళ్ళింది నిత్యామీనన్ కాదట!
Published on: Sat Jul 20, 2013 11:56AM

ప్రముఖ సినీ నటి నిత్యమీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తూ విమానంలోని కాక్ పిట్ లోకి వెళ్లారని, దీంతో పైలట్లను సస్పెండ్ చేసి డీజీసీఎ విచారణకు ఆదేశించారని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వట్టిదే అని నిత్యమీనన్ మేనేజర్ చెబుతున్నారు. అసలు ఈ మధ్య కాలంలో నిత్యమీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళ్లలేదని తెలిపారు. ఈ మధ్య ఒకసారి కొచ్చిన్ నుండి హైదరాబాద్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారని అంతకుమించి ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. ఈ విషయాన్ని నిత్యమీనన్ కు చెబితే నవ్వి ఊరుకున్నారని ఆయన అన్నారు. మరి ఇప్పటికే సస్పెండ్ అయిన ఎయిర్ ఇండియా పైలట్లు కాక్ పిట్ లోకి అనుమతించి ముచ్చట్లు పెట్టిన నటి ఎవరన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.


