భూకంప అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశా.. కేంద్రమంత్రి
Published on: Mon Jan 4, 2016 10:27AM
ఈశాన్య భారతదేశంలో భూకంప చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూకంప అనుభవాన్ని తాను స్వయంగా చూసినట్టు చెబుతున్నారు కేంద్రమంత్రి నిర్మలారామన్. నిర్మలారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటల్ని పరిశీలించేందుకు గాను పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడ ఆమె అనేక ప్రాంతాలు పర్యటించి పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో ఉన్న ప్రభుత్వ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అయితే అక్కడ ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో గది మొత్తం ఊగిపోయిన పరిస్థితులతో ఆమె ఆందోళనతో బయటకు వచ్చారంట. అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోయినా తాను మాత్రం భూప్రకంపనల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని.. తాను బస చేసిన హోటల్ గది కంపించి పోయిందని.. అయితే.. తామంతా క్షేమంగా ఉన్నట్లుగా ఆమె ట్విట్టర్ లో తెలిపారు.


