కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా హ్యాకింగ్ షాక్
Published on: Thu Nov 12, 2015 5:14PM

సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కు గురవ్వడం వింటుంటా. ఇప్పుడు ఈ హ్యాకర్లు ప్రభుత్వ అకౌంట్లను సైతం హ్యాక్ చేసే స్థాయికి చేరారు. కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఈ హ్యాకింగ్ షాక్ తగిలింది. నిర్మలా సీతారామన్ కు చెందిన ట్విటర్ హ్యాండిల్-@CimGOI అనే ట్విటర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఎవరో తమ ఉత్పత్తి తాలూకు ప్రచారం కోసం మంత్రిగారి అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో ప్రొడక్ట్ గురించిన వివరాలు పోస్ట్ చేశారట. అయితే దీనిని గమనించిన మంత్రి గారి సన్నిహితులు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడంతో ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపి.. తన ట్విటర్ అకౌంట్ ను ఎవరు హ్యాక్ చేశారో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.


