TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు అస్వస్థత.. ఎయిమ్స్ లో చేరిక

Published on: Mon Dec 26, 2022 1:48PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురై  ఆస్పత్రిలో చేరారు.   ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్) లో సోమవారం (డిసెంబర్ 26)  చేరారు.

అయితే జనరల్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లరని ఆమెకు సన్నిహితంగా  ఉండే వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.  

వార్షిక బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్న నిర్మలా సీతారామన్ తనకు ఒకింత అసౌకర్యంగా ఉందని చెప్పడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆమె వయస్సు 67 ఏళ్లు. ఆమెకు భర్త పరకాల ప్రభాకర్, కుమార్తె  వాంగ్మయి ఉన్నారు.