విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు నిధులు
Published on: Tue Jul 23, 2024 11:57AM
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో విశాఖ చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటయించారు. అలాగే విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటంచారు.
ఇందులో భాగంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు అంతుతాయి. పట్టణ గృహ నిర్మాణం కోసం కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ 2.2 కోట్ల రూపాయలు, రూరల్ డెవలప్ మెంట్ కు 2.66 లక్షల కోట్లు కేటాయించారు.
అలాగే మౌలిక సదుపాయాల కల్పనకూ పెద్ద పీట వేశారు. బడ్జెట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.


