నా కూతురే అయితే సజీవ దహనం చేసేసేవాడిని

 

“నా కూతురే గనుక పెళ్ళికి ముందే శృoగారంలో పాల్గొంటూ పరాయి మొగాడితో అలా అర్ధ రాత్రి వరకు రోడ్ల మీద తిరిగి ఉంటే, ఆమెను నేనే సజీవ దహనం చేసేసేవాడిని. అసలు ఇటువంటి పరిస్థితి రానే రానీయకపోదును. తల్లి తండ్రులందరూ కూడా ఇటువంటి ధోరణినే అలవరచుకోవాలి,” ఈ వివాద స్పద మాటలు అన్నది మరెవరో కాదు నిర్భయ కేసులో ఇద్దరు దోషుల తరపున డిఫెన్స్ లాయర్ గా వాదించిన ఏపీ.సింగ్.

 

ఆయన చేసిన వ్యాఖ్యలతో డిల్లీ ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వారే గాక డిల్లీ బార్ కౌన్సిల్ సభ్యులు కూడా అతని వ్యాక్యలను తప్పుపట్టారు. అతనిపై ఎవరయినా లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లయితే దాని ఆధారంగా కేసు వేస్తామని, లేకుంటే అతను మీడియాతో అన్నమాటలనే సుమోటోగా స్వీకరించి అతనిపై కోర్టులో కేసు వేస్తామని డిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి మురారి తివారి మీడియాకు తెలియజేసారు. ఈ నెల 20న జరుగనున్న బార్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.