పీఎన్‌బీ స్కాంపై నోరువిప్పిన ప్రధాని మోడీ

దేశ బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయటం ఎంత మాత్రం ఉపేక్షించేది లేదన్నారు.. ఆర్థిక మోసాలకు పాల్పడేవారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ముంబైలోని ఒక బ్రాంచ్‌లో 11,400 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగుచూసింది. నీరవ్ మోడీ అని వజ్రాల వ్యాపారి పీఎన్‌బీ అధికారులు జారీ చేసిన ఎల్‌ఓయూల ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు రుణాన్ని మంజూరు చేశాయి. గత కొంతకాలంగా వడ్డీతో పాటు అసలు కూడా కట్టకుండా ఈ ఏడాది జనవరిలో మోడీ విదేశాలకు పారిపోయాడు.