TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నరకంగా మారిన రాత్రి ప్రయాణాలు.. వాహనాల ఎల్ఈడీ లైట్లతో ప్రమాదాలు

Published on: Wed May 20, 2026 10:53AM

రాత్రి వాహనాలలో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.  ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడీ లైట్ల వల్ల  ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ ఎల్ఈడీ లైట్ల కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.  

గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్   స్టిక్కర్  ఉండాలన్న నిబంధన ఉండేది. ప్రస్తతం పరిస్థితి చూస్తుంటే.. ఆ నిబంధన ఇప్పుడు అమలులో లేదేమో, దానిని తీసేశారేమో అనిపిస్తోంది.

 వాహనాల ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక,    ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సంబంధిత అధికారులు ఇప్పటికైనా వాహనాల ఎల్ఈడీ లైట్ లపై దృష్టి సారించాలనీ,  కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించి, కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.