TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దిగొచ్చిన జ‌గ‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ వాయిదా.. సంక్రాంతి తర్వాతే అమ‌లు..

Published on: Tue Jan 11, 2022 2:26PM

ఏపీలో స‌డెన్‌గా నైట్ క‌ర్ఫ్యూ పెట్టారు. థియేట‌ర్ల‌లో 50శాతం ఆక్యుపెన్సీ అన్నారు. అదేంటి.. సంక్రాంతి ముంద‌ర ఈ నైట్ క‌ర్ఫ్యూ ఏంటి? అని అంతా గ‌గ్గోలు పెట్టారు. జ‌గ‌న్ కావాల‌నే హిందూ పండ‌గ‌ల ముందు నైట్ క‌ర్ఫ్యూను విధించారంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. సంక్రాంతి సీజ‌న్‌లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌ల‌నూ అంతా త‌ప్పుబ‌ట్టారు. ఎట్ట‌కేల‌కు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగొచ్చింది. నైట్ క‌ర్ఫ్యూ అమ‌లును కాస్త వాయిదా వేసి.. సంక్రాంతి త‌ర్వాత నుంచి అమ‌లు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వులు స‌వ‌రించింది. 

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమ‌లు చేయ‌నుంది ఏపీ స‌ర్కారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తాజాగా కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది.

ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించ‌నుంది. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.