Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో 10 నుంచి నైట్ కర్ఫ్యూ?
posted on: Jan 7, 2022 10:49AM
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ జెట్ స్పీడ్‌తో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం ఏ మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని.. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు సంక్రాంతి పండగ వస్తోంది. సంక్రాంతి అంటేనే సినిమా పండగా.. ఈ పండగ పురస్కరించుకుని చిన్న, పెద్ద కలిపి దాదాపు పది సినిమాలు విడుదల కానున్నాయి. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలు ఈ సమయంలో విడుదల కాకపోయినా.. సంక్రాంతి పండక్కి ఏదో ఒక సినిమా విడుదలవుతోందని సినీ అభిమానులు ఓ వైపు సంబరపడుతుంటే.. చిన్న సినిమాలకు సైతం ఛాన్స్ దొరికిందంటూ మరో వైపు నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కానీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే.. సెకండ్ షోలు రద్దు అవుతాయని దీని వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయే అకావశం వుందని... టాలీవుడ్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు కూడా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ ఏపీలో అలా కాదు.. ఇప్పటికే జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గించింది.దాంతో రాష్ట్రంలోని చాలా థియేటర్లు మూసివేశారు. ఇక రాత్రి కర్ప్యూ కూడా పెడితే.. సంక్రాంతి పండగకు విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఏమిటని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా పరిశ్రమ మూలుగుతోందని.. ఇక రాత్రి కర్ఫ్యూ కూడా పెడితే.. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా పరిస్థితి మారుతోందని టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


.webp)
.webp)


