నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకూ అంటే...
Published on: Tue Feb 1, 2022 2:06PM
జనవరి 31తో ఏపీలో నైట్ కర్ఫ్యూ ముగిసింది. మళ్లీ పొడిగిస్తారా? ముగిస్తారా? అనే ఆసక్తి పెరిగింది. పాజిటివ్ కేసులు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. దీంతో.. నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కారు.
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
ఇప్పటికే జనవరి 18 నుంచి 31 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేసింది ప్రభుత్వం. ఆ గడువు సోమవారంతో ముగియడంతో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో రెండు వారాలు.. 14 రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


