TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ చానెల్ పై ఎన్ హెచ్ఆర్సీ కేసు

Published on: Thu Jun 12, 2025 10:41AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ జగన్ సొంత మీడియా చానెల్ లో జరిగిన లైవ్ డిబెట్ లో చేసిన వ్యాఖ్యలపై నరసరావు పేట ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయులు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  చానల్‌లో సీనియర్ జర్నలిస్టు  కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయనీ, వారిని కించపరిచేవిగా ఉన్నాయనీ లావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇదే విషయమై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండికాకూ ఫిర్యాదు చేశారు.  ఆ ఫిర్యాదుల్లో   సదరు చానెల్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని లావు శ్రీకృష్ణదేవరాయులు కోరారు.అలాగే జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఆయన ఫిర్యాదు చేశారు.కాగా నరసరావుపేట ఎంపీ ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మావనహక్కుల కమిషన్  ఆ చా నల్ పై కేసు నమోదు చేసింది. 

ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ ఆ లైవ్ షోలో మహిళలపై అనుచిత వ్యాక్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును అరెస్టు చేశారు. ఇక ఇదే విషయంలో పోలీసులు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.