TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనుష్క శర్మ ‘ఎన్‌హెచ్ 10’ ట్రైలర్ రిలీజైంది

Published on: Fri Feb 6, 2015 2:16PM

 

మొన్నీమధ్యే ‘పీకే’ సినిమా ద్వారా పెద్ద హిట్ కొట్టిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఇప్పుడు మరో హిట్ మీద కన్నేసింది. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా. ఆ సినిమా పేరు ‘ఎన్‌హెచ్ 10’ నవదీప్ సింగ్ దర్శకత్వంలో ఎరోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం నాడు విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ అదరింది. సహజంగానే అనుష్క శర్మ కూడా అదిరింది. మొత్తమ్మీద ఇదొక రివెంజ్ స్టోరీ అని అర్థమవుతోంది. కరడుగట్టిన మనుషులు అందంగా సాగిపోయే తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసినప్పడు ఒక అబల తిరగబడి ఎలా వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నట్టుగా అర్థమైంది. ఈ ట్రైలర్ వరస చూస్తుంటే అనుష్క శర్మ మరో హిట్టు కొట్టేట్టే వుంది.