TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్లి అయినా 5 రోజులకే.. పెళ్లి కూతురికి  వాంతులు.. 

Published on: Wed May 19, 2021 10:31AM

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా .. విరిసీవిరియని ఓ చిరునామా పెళ్లి కూతురుగా ముస్తాబయి.. స్మశానానికి పాపురమెళ్ళావా.. పాట గుర్తు చేసింది.. ఈ ఘటన. అది నాటారు కర్నూల్ పట్టణానికి చెందిన అమ్మాయికి. తాండూర్ మండల పట్టణానికి చెందిన అబ్బాయి. వారి ఇద్దరికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ముహుర్తాలు పెట్టారు. పెద్దల సమక్షం లో, వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన ఆ ఇంట్లో చివరికి కన్నీరు మిగిలాయి. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

పెళ్ళికి వేసిన పందిరి ఇంకా ఆరలేదు. పెళ్ళికి వచ్చిన బంధువులు ఇంకా ఇళ్లకు చేరలేదు. వరుడుకట్టిన పసుపుతాడు ఇంకా ఆరలేదు. పెళ్లి కూతురుకు పెట్టిన కాళ్ల పారాణి ఆరలేదు. అంతలోనే ఆ పెళ్ళి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా కలలు కన్నా వారిది జీవితం లో కన్నీరు మిగిలింది. పెండ్లి కూతురు ప్రాణాలు విడిచింది. పెండ్లైన ఐదు రోజులకే వరుడిని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్‌లో జరిగింది. నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రీవాణి(19) ఈ నెల 14న తాండూరు వాసి నవీన్‌ వివాహం చేసుకుంది. ఆ తర్వాత పెండ్లి, డిన్నర్ తంతు కూడా ముగిసింది. అనంతరం మంగళవారం భార్యభర్తలు ఇరువురూ గుడిలో అభిషేకం చేసుకుని ఇంటికి చేరారు. ఇంతలోనే శ్రీవాణికి వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ నవ వధువు తుదిశ్వాస విడిచింది. కారోనా కారణంగానే మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం కాదని కొట్టిపారేస్తున్నారు. తిండి, నిద్ర సరిగ్గా లేక బీపీ డౌన్ అయి ఇలా జరిగిందని.. కొవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చిందంటున్నారు. ఇది ఇలా ఉంటే పెండ్లి జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకున్న వరుడు.. వధువు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు.