దీక్ష విరమించిన మాజీ డీఎస్పీ నళిని
Published on: Sat Dec 17, 2011 8:05AM
న్యూ
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షను మాజీ డీఎస్పీ నళిని శుక్రవారం దీక్ష విరమించారు. బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ నళినికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆమె 8 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు 8 కిలోల బరువు తగ్గిందని తెలిపారు. బీపీ, షుగర్ లెవెల్ పడిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దీక్ష విరమించాలని ఆమెకు సూచించారు. మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రత విపరీతంగా పడిపోయింది. ప్రస్తుత స్థితిలో దీక్ష కొనసాగించడం మంచిది కాదని ప్రకాష్ జవదేకర్ సూచించి, ఆమె చేత దీక్ష విరమింపజేశారు.


