TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దల అపాయింట్‌మెంట్ల కోసం సీఎం ఎదురుచూపులు

Published on: Sat Feb 4, 2012 1:45PM

న్యూఢిల్లీ: అధిష్టానం పెద్దల అపాయింట్‌మెంట్ల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పడిగాపులు పడాల్సివస్తోంది. మంత్రివర్గ  విస్తరణకు అనుమతి పొందడానికి శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన ఆయన పెద్దల అపాయింట్‌మెంట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ల కోసం ఎపి భవన్‌లో ఉదయం నుంచీ వేచి చూస్తున్నారు.  కాగా, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. సమావేశాల్లోగానే తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అలా చేసుకుంటే తప్ప తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేమని ఆయన భావిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రికి పరిస్థితి అంత అనుకూలంగా కనిపించడం లేదు.