TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వీడనున్న చిదంబరం పాత్రపై 2జీ మిస్టరీ

Published on: Sat Feb 4, 2012 8:39AM

న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రమేయం ఉందన్న ఆరోపణలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. ఈ కేసులో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గురువారం ఇచ్చిన 2జీ లెసైన్సుల రద్దు ఆదేశాల్లో సుప్రీంకోర్టు ఈ అంశంపై నిర్ణయాన్ని ట్రయల్ కోర్టుకే వదిలేసిన సంగతి తెలిసిందే. 2జీ కుంభకోణంలో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాతోపాటు నాటి ఆర్థిక మంత్రి చిదంబరానికీ సమానమైన పాత్ర ఉందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో ఆరోపించారు.