ఢిల్లీకి తాకిన చిరువర్గం నేతల కేబినెట్ పంచాయతీ
Published on: Thu Jan 12, 2012 2:22PM
న్యూఢి
ల్లీ: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతల కేబినెట్ పంచాయతీ ఢిల్లీకి తాకింది. కడప జిల్లా సీనియర్ నేత సి.రామచంద్రయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రిపదవి ఇవ్వవద్దంటూ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, కాంగ్రెసు నేతలు చెంగల్రాయుడు, అహ్మదుల్లాలు కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను గురువారం కలిసి కోరారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన, అవిశ్వాస తీర్మానంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్న చిరంజీవి వర్గం నేతలకు అధిష్టానం రెండు పదవులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరు ఎవ్వరిని సూచిస్తే వారికి ఇవ్వడానికి అధిష్టానం ఓకె చెప్పింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, సి.రామచంద్రయ్య పేర్లను చిరంజీవి సూచించారు. అయితే సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడాన్ని మాత్రం జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు.


