TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఇవ్వం తేల్చిచెప్పనున్న సోనియా

Published on: Mon Dec 26, 2011 8:24AM

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో తెలంగాణపై తేల్చేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధన కుదరలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పేందుకు కాంగ్రెసు అధిష్టానం రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. జనవరిలో జరిపే కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించి తుది అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయాన్ని కూడా వారి నుంచి రాబట్టి ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు శరద్ పవార్, మమతా బెనర్జీ, కరుణానిధి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి కాంగ్రెసు పార్టీకి రెండున్నరేళ్ల వ్యవధి ఉంటుంది.