హజారే కు పెరుగుతున్న మద్దతు
Published on: Mon Dec 26, 2011 8:16AM
న్యూ
ఢిల్లీ: ప్రభుత్వం బలమైన లోక్‌పాల్‌ను రూపొందించాలని సామాజిక కార్యకర్త అన్నా హజారే కోరారు. ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు ఎంపీలకు రాసిన బహిరంగ లేఖలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. లోకాయుక్త, లోక్‌పాల్‌లు వ్యక్తిగత విచారణ నిర్వహించేందుకు కూడా ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అవినీతి విచారణలో గ్రూప్ సి, డి ఉద్యోగులను కూడా నేరుగా లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు జైల్ భరో ఆందోళనకు పిలుపు ఇచ్చిన అన్నా హజారేకు మద్దతు పెరుగుతోంది. టీమ్ అన్నా ఆవిష్కరించిన జైల్ ఛలో వెబ్‌సైట్‌లో లక్షల్లో జనం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. లోక్‌పాల్ కోసం అన్నా హజారే ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేపట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల నుంచి అన్నాకు మద్దతు విపరీతంగా పెరుగుతోంది.


