ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కిన ఉగ్రవాదులు
Published on: Fri Dec 23, 2011 9:42AM
న్యూఢిల్లీ
: ఇద్దరు అంతర్జాతీయ ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరు బబ్బర్ ఖల్సాకు చెందిన సర్వప్రీత్, జస్వీందర్గా గుర్తించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. వీరిలో ఒకరిని పంజాబ్ లో అరెస్ట్ చేయగా మరొకరిని ఢిల్లీలోని షాలిమార్ బాగ్ లో అరెస్ట్ చేశారు.


