పార్లమెంటు సభ్యులకు ఉండవల్లి గీత బోధ
Published on: Tue Dec 20, 2011 3:34PM
న్
యూఢిల్లీ: భగవద్గీతలోని నిగూఢ రహస్యాలను భారతీయులు మాత్రమే అర్థం చేసుకోగలరని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం లోక్‌సభలో అన్నారు. భగవద్గీతను నిషేధించాలని రష్యాలో వేసిన కేసును ఆయన తప్పు పట్టారు. శంకరాచార్య, తిలక్, రాధాకృష్ణన్ వరకు ఒక్కరొక్కరు ఒక్కోలా గీతను విశ్లేషించారని అది మనమే అర్థం చేసుకోగలమన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి విపక్ష సభ్యులకు గీతాబోధ చేశారు. రష్యాలో భగవద్గీతను నిషేధించడంపై ఇక్కడ నిరసన తెలుపుతున్నాం కానీ గీతలో చెప్పిన దాన్ని మనం పాటిస్తున్నామా? అని ప్రశ్నించారు. శ్రేష్టులు చెప్పిన దాన్ని మరోపాట లేకుండా పాటించాలని గీతలో ఉంది, కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం మనం నడుచుకుంటున్నామా? 120 కోట్ల జనాభా సమస్యల్ని చర్చించాల్సిన సభ్యులు చర్చను మానేసి రోజూ పార్లమెంటును అడ్డుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శ్లోకాలు పాడి వాటిని వివరించి అందరినీ ఆకట్టుకున్నారు.


