న్యూజిలాండ్ 45 ఆలౌట్, కల్లిస్ రికార్డ్

Publish Date:Jan 3, 2013

 

New Zealand bowled out for 45, South Africa v New Zealand, South Africa, New Zealand

 

 

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 45 పరుగులకే తొలి రోజు కుప్పకూలింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బాట్స్ మెన్ లు పెవిలియన్ కి క్యూకట్టారు. విలియమ్సన్ తప్ప ఒక్క బ్యాట్సుమెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. 19.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఆలౌటైంది. టెస్టు లో న్యూజిలాండ్ కు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఫిలాండర్ 5, మోర్కెల్3, స్టెయిన్ 2 వికెట్లు తీశారు.


తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా అలవిరో పీటర్సన్(103) సెంచరీతో చెలరేగాడు. ఆమ్లా(66), కలిస్(60) రాణించారు. దీంతో దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో 13వేల పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా 37 ఏళ్ల కలిస్ ఖ్యాతిగాంచాడు. మొదటి మూడు స్థానాల్లో సచిన్, పాంటింగ్, ద్రావిడ్ ఉన్నారు.