అమరావతి నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డు....జగన్ ఏమి చేస్తారో ?

 

ఏపీ రాజధాని అమరావతి మీద జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే జానానికి అనుమానం పట్టుకుంది. దానికి కారణం మొదటి నుండి రాజధాని అక్కడ కట్టడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ రావడమే. అదీ కాకా ఎన్నికల ముందు జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. 

అయితే జగన్ వైపు నుండి పడతాయి అనుకున్న బ్రేకులు ప్రపంచ బ్యాంక్ నుండి పడేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే వెంటనే తాము తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే బాబు సర్కార్ ఆ నిదులను సద్వినియోగం చేసింది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేసినా వచ్చే నష్టం లేదు. కానీ ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం ఇప్పటి వరకు దేశంలో లేదని, ఇప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వమని కేంద్రం చెప్తోంది. 

ఇక దీంతో ఎటూ రాజధాని మార్చాలని చూస్తున్న జగన్ కు ఈ  వ్యవహారం కలిసోచ్చేలా ఉంది. ఇప్పటి వరకూ లేని ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని అది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది.

ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూత్రప్రాయంగా పేర్కొన్నట్టు సమాచారం. దాని స్థానే ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కి కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయనకి ఇది రిస్క్ లానే తోస్తోంది.

ఎందుకంటే తనిఖీల విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. కానీ కేంద్రం తనిఖీలను వ్యతిరేకిస్తుంది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ లేఖ అయితే పంపింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయనుంది అనేదే ఆసక్తికరంగా మారింది. 

ఎందుకంటే నిర్మణాలు మొదలు పెట్టి చాలా వరకూ పూర్తి చేసుకున్న అమరావతికే నిధులు సమకూర్చలేకుంటే ఇంకా కొత్తగా ఓకవేళ దొనకొండ రాజధాని అని చెప్పినా అది ప్రజామోదం పొందే అవకాశం లేదు, దీంతో జగన్ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. చూడాలి అమరావతి ఏమవుతుందో ?