TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాకినేని పునరాగమనంపై అసంతృప్తి

Published on: Thu May 3, 2012 10:03AM

గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్యను తిరిగి తెలుగుదేశంపార్టీలోకి చేర్చుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక మాకినేని పెదరత్తయ్యకు ప్రధాన అనుచరునిగా పేరుపొందిన కందుకూరి వీరయ్యకు ప్రత్తిపాడు అసెంబ్లీ దేశం టిక్కెట్టును కేటాయించడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

 

 

మాకినేని పెదరత్తయ్య ప్రత్తిపాడు నుంచి ఎన్నికై 16 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఉన్నారు ఈ 16 ఏళ్ళలో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న అపవాదును ఎదుర్కొన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. 2010 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశంపార్టీ టిక్కెట్టు లభించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాచినేని పెదరత్తయ్య వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎంతోకాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు. తిరిగి ఆయన తెలుగుదేశంపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనికి చంద్రబాబునాయుడు కూడా అంగీకారం తెలిపారు. అయితే, స్థానిక నాయకులు, కార్యకర్తలు మాకినేని పెదరత్తయ్య పునరాగమనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయభవిష్యత్తు మరోసారి అగమ్యగోచరంగా తయారైంది.