కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు?
Published on: Tue Jun 26, 2018 4:57PM
.png)
ఇప్పుడిప్పుడే బీజేపీ మీద వ్యతిరేక పవనాలు వీస్తుండంతో.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.. ప్రతి రాష్ట్రం మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్, ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది.. విభజన ప్రభావంతో ఏపీలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్, ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది.. ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం అసలు లేదు, అందుకే కనీసం ఓట్ల శాతమైనా పెంచుకోవాలని చూస్తుంది.. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రత్యేకహోదా అంశం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారట..
అలానే రాహుల్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చాలని చూస్తున్నారట.. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రఘువీరా రెడ్డి స్థానంలో, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను నియమించాలి అనుకుంటున్నారట.. ఇదివరకే రఘువీరా రెడ్డిని మార్చాలని అధిష్టానం చూసింది.. కానీ కొన ఊపిరితో ఉన్న పార్టీ కావడంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే దైర్యం వేరే నాయకులు చేయలేకపోయారు.. మరి ఇప్పుడు నాదెండ్ల కాంగ్రెస్ పగ్గాలు చేపడతారా? ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.


