ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
Published on: Mon Jul 14, 2014 2:06PM
.jpg)
గత కొన్ని రోజులుగా నలుగుతున్న గవర్నర్ల బదిలీ మరియు నియామకాల సమస్యకు తెర దించుతూ మోడీ ప్రభుత్వం ఈరోజు ఆరు రాష్ట్రాలకు పార్టీకి చెందినా సీనియర్ నేతలు, మాజీ మంత్రులను గవర్నర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి రాం నాయక్-ఉత్తర ప్రదేశ్, పద్మనభాచార్య-త్రిపుర, నాగాలాండ్, ఒ.హెచ్. కోహ్లీ-గుజరాత్, బలరామ్ జీ టాండన్-ఛత్తీస్ఘర్, కేదార్ నాథ్ త్రిపాటి-పశ్చిమ బెంగాల్ గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మరి కొద్ది సేపటిలో రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవచ్చును.


