ఏపీలో నూతన మద్యం విధానం!
Published on: Tue Oct 1, 2024 1:11PM

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యంపై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రెండు రోజుల్లో షాపుల ఏర్పాటుపై మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. కొత్త మద్యం షాపులకు మంగళవారం (అక్టోబర్ 1) నుంచి అక్టోబర్ 9వ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11వ తేదీన 3,396 షాపులకు లాటరీ తీస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విడతలో 3,396 షాపులను ప్రైవేటుకు కేటాయించారు.


