తడిసి ముద్దైన దేశ రాజధాని
Published on: Wed Aug 29, 2012 2:03PM
దేశ రాజధాని న్యూఢిల్లీ వర్షంతో తడిసి ముద్దైంది. న్యూఢిల్లీలోని రోడ్లు కాలువలను తలపించాయి. గత తొమ్మిదిరోజులుగా వర్షాలు పడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో హత్నికుండ్ బ్యారేజీ నుండి విడుదలైన నీటితో యమునా నది ప్రమాద స్థాయిని దాటుతుంది. యుమునా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. యమునానది మామూలు స్థాయి 202.30 మీటర్ల కన్నా స్థాయిలో ప్రవహిస్తుంది. యమునానది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 307.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.


