TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్‌పాల్ బిల్లుపై గందరగోళం సభ వాయిదా

Published on: Thu Dec 22, 2011 2:37PM

న్యూఢిల్లీ : లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై సభలో గందరగోళం నెలకొంది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభ మళ్ళీ వాయిదా పడింది. ప్రభుత్వం తయారు చేసిన లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనలకు దిగాయి.మరో  వైపు లోక్‌పాల్‌పై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యింది.అలాగే లోక్‌పాల్‌ బిల్లుపై ఆర్ఎస్ఎస్, ఆర్జేజీలు వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లోక్‌పాల్ బిల్లులో మైనారిటీ రిజర్వేషన్లను తొలగించిందన్నారు. లోక్‌పాల్ బిల్లులో మైనారిటీల పేరును చేర్చాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.