కొత్త ప్రపంచ ఛా౦పియన్ 'కార్ల్‌సన్‌'

 

 

 

ప్రపంచ చెస్ సరికొత్త చాంపియన్ గా యువ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ ఆవిర్భవించాడు. సొంతగడ్డపై ఐదుసార్లు చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు షాకిచ్చాడు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారిగా ప్రపంచ చాంపియన్‌షిప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పదో రౌండ్‌ను డ్రా చేసుకున్న కార్ల్‌సన్ 12 గేమ్‌ల ఈ మ్యాచ్‌లో మరో రెండు రౌండ్లు మిగిలుండగానే టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.

 

పది రౌండ్లు ముగిసే సరికి 6.5-3.5తేడాతో చాంపియన్‌గా నిలిచాడు. ఈ పది రౌండ్లలో మూడు గేమ్‌లు నెగ్గిన కార్ల్‌సన్, ఏడు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. కాగా, సొంతగడ్డపై నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆనంద్ ఒక్క గేమ్‌లో కూడా విజయం సాధించలేకపోయాడు. ఆనంద్ 2000, 2007, 2008, 2010, 2012లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించాడు. ఆనంద్ తన 22 ఏళ్ల కెరీర్‌లో కనీసం ఒక్క విజయం కూడా లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ముగించడం ఇదే తొలిసారి.