చెక్కపెట్టెలో బాలుడు..
Published on: Wed Jun 16, 2021 2:20PM
రామాయణంలో సీత భూమిలో దొరికిందని చెప్పుకున్నాం.. మొన్నటికి మొన్న గంగా నదిలో కరోనా శవాలు దొరికాయని వార్తలు విన్నాం.. తాజాగా గంగా నదిలో ఓ చక్క పెట్టె కొట్టుకు వచ్చింది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డతో పాటు కనకదుర్గ అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి అంతా అశ్చర్యపోయారు.
మణిరత్నం దళపతి సినిమాలో చిన్నపుడు రజనీ కాంత్ నదిలో గడ్డిమీద వచ్చినట్లు ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. ఆ సౌండ్ వినగానే ఆ నదిలో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీంతో పరిశీలించి చూడగా..నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీంతో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది.
దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు. గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో మనుషుల్లో మానవత్వం కరువైయింది. నవమాసాలు మోసి కన్న పిల్లలను కూడా గాలికి వదిలేస్తున్నారు. పసికందులను పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి ఇలాంటి వార్తలు బాగా పెరుగుతున్నాయి. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు.


