లోయలో పడిన బస్సు.. 26 మంది మృతి..
Published on: Fri Mar 10, 2017 9:24AM

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 26 మంది మరణించగా, మరో 36 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం...నేపాల్ రాజధాని ఖాట్మండుకు కొంత దూరంలో ఒక బస్సు హిమాలయ పర్వతాల్లో వెళుతుండగా అదుపు తప్పి, లోయలోకి పడింది. బస్సు లోయలో సుమారు 200 మీటర్ల దిగువకు దొర్లుతూ వెళ్లి నదిలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించగా, మరో 36 మంది గాయపడగా.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్లలో తరలించామని తెలిపారు.


