TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహేష్ 1 పాటల లిస్ట్

Published on: Tue Dec 17, 2013 5:14PM

 

మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1" చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ అంచనాలను మరింతగా పెంచే విధంగా ఇటీవలే విడుదలైన ఆడియో టీజర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మహేష్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అవడంతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే పాటలను అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు బిట్ సాంగ్స్ టీజర్స్ అదిరిపోయే రేంజులో సినిమా సత్తాను చూపెడుతుంది. ఈనెల 19వ తేదిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి అన్ని సిద్ధమయ్యాయి. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని పాటల ట్రాక్ లిస్ట్ ప్రత్యేకంగా మీకోసం.

1. Who R U

2. You’re My Love

3. O Sayonara Sayonara

4. Aww TuzoMogh Kortha

5. London Babu