TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నదాతల సమస్యలను సభ ముందుకు: జగన్

Published on: Tue Dec 20, 2011 9:55AM

న్యూఢిల్లీ : నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం ఉదయం  వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్ నేడు లోక్సభలో ప్రస్తావించనున్నారు. క్రాప్‌ హాలీడే, పంట మద్దతు ధరలు, రుణాల విషయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా సభ ముందుకు తేనున్నారు.ఈ మేరకు వైఎస్ జగన్ లోక్‌సభలో 377 నిబంధన కింద స్పీకర్‌కు నోటీస్‌ ఇచ్చారు. అలాగే ఈరోజు సాయంత్రం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలుసుకోనున్నారు.