TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి

Published on: Thu May 15, 2025 10:48AM

కోటం రెడ్డి స్పీడే వేరు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు. అందుకు మే 15 (గురువారం) ముహూర్తం పెట్టారు. ఈ పనులన్నిటీనీ రెండంటే రెండు నెలల్లో పూర్తి చేశారు. ముందుగానే 60 రోజుల టార్గెట్ ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగారు. రికార్డు సమయంలో పూర్తి చేసినా పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రానీయలేదు. ఇక వీటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగానే చేస్తున్నారు. మే 15న నెల్లూరు రూరల్ లో ఈ  పనులను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రారంభించనున్నారు. మంత్రి పొగూరు నారాయణ, కూటమి నేతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పెట్టుకున్న టార్గెట్ మేరకు కేవలం 60 రోజుల వ్యవధిలోనే మొత్తం 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి లోకేష్ అభినందించారు.