TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు పార్లమెంట్ స్థానంపై దేశం ఆశ!

Published on: Wed Apr 25, 2012 12:59PM

రానున్న ఉప ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానంపై తెలుగుదేశంపార్టీ ఆశ పడుతోంది. ఈ స్థానానికి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా ఒంటెద్దు వేణుగోపాల్ రెడ్డినే మరల ఎంపిక చేసింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభార్తిగా తాజా మాజీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి బలమైన అభ్యర్థి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు థీటుగా టి.సుబ్బిరామిరెడ్డిని అభ్యర్థిగా రంగంలోకి దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

కాంగ్రెస్ అభ్యర్థి బలమైన అభ్యర్థి కావడం వల్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఓటింగ్ చీలిక రావడం ఖాయమని దాంతో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం వున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఆశపడుతున్నారు. కాంగ్రెస్ అభార్తిగా రంగంలోకి దిగుతున్న సుబ్బిరామిరెడ్డి నెల్లూరు ప్రాంతానికి చెందినప్పటికీ రాజకీయంగా మాత్రం ఎప్పుడూ ఈ ప్రాంతంనుంచి పోటీ చేయలేదు.

 

 

కొత్త ఒక వింత అన్నట్టుగా ఈ ప్రాంత ప్రజలలో సిబ్బిరామిరెడ్డి పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా సుబ్బిరామిరెడ్డి గెలిస్తే కేంద్రంలో మంత్రిఅప్దవి లభిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లు సంప్రదాయంగా కాంగ్రెస్ కు లభించే ఓట్లను పంచుకుంటాయని, తెలుగుదేశంపార్టీకి సంప్రదాయంగా లభించే ఓటింగ్ లో చీలిక లేకపోవడం వల్ల దేశం అభ్యర్థి విజయం సాధించడం సులభామనే వాదనలు వినవస్తున్నాయి.